Thursday, August 6, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్డయల్‌ 112 ను 
ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

డయల్‌ 112 ను 
ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

- Advertisement -


నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి

బాధితులు కాల్ చేసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలా డయల్‌ 112ను రూపొందిం‌చినట్టు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఐసీసీసీలో డయల్‌ 112ను డీజీపీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఏదైనా ఆపదకు లోనైన సమయంలో సహాయం కోసం 112కు కాల్ చేసిన వెంటనే సంబంధిత విభాగానికి చెందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా ఈ అత్యవసర నెంబర్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెంబర్‌‌కు ఫైర్, మహిళా భద్రత, తదితర విభాగాలను కూడా అనుసంధానం చేసినట్టు చెప్పారు. ఇందుకోసం ఆధునిక పరిజ్ఞానాన్ని వాడినట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు తక్కువ సమయంలో పోలీసులు అందుబాటులోకి వచ్చేందుకు ఈ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖగోయల్, నగర సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -