నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిపి కార్యదర్శిల ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, సూపరిండెంట్ క్రాంతి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకలా పనిచేశారని, తెలంగాణ ఏర్పాటు వాదానికి తాను కట్టుబడి ఉండి, ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చి మహోద్యమాన్ని చేపట్టి ప్రత్యేక తెలంగాణకు బాటలు వేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర విద్యార్థులు, అధ్యాపకుల కృషి అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు సూపరింటెండెంట్, ఎంపీ ఓ రాము, సీనియర్ అసిస్టెంట్ మధు పంతులు , జూనియర్ అసిస్టెంట్ గంగాధర్, మండలంలోని వీధి వివిధ గ్రామాల కార్యదర్శులు నాగయ్య, భరద్వాజ్ , రాములు , అంజయ్య , లింగురాం, అటెండర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ కార్యాలయంలో ప్రొ.జయశంకర్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



