- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దీప్తిని వెలిగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో సహా వివరించేవారని, ఆయన జీవిత విశేషాలు, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



