Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ క్షేత్రంలో కేరళ  హైస్కూల్ విద్యార్థులు

వ్యవసాయ క్షేత్రంలో కేరళ  హైస్కూల్ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌కు చెందిన 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులు గురువారం నాగారం గ్రామంలోని రైతు ఎర్రబెల్లి వెంకటేశం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వరి నాటు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించిన విద్యార్థులు రైతును అడిగి పంట సాగుకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి నారు పంచి, వరి నాటు వేస్తూ వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ బి. రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు అనుభవాత్మక విద్య కూడా అవసరమన్నారు. తరగతి గదులకు మాత్రమే పరిమితం కాకుండా బయటి ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ క్షేత్ర పర్యటన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మనం తినే బియ్యం ఎలా పండుతుంది, రైతు ఎంత కష్టపడతాడు అనే విషయాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారని, రైతే దేశానికి వెన్నెముక అనే భావన వారికి అవగాహన అయిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ, కరస్పాండెంట్ అల్లే శైలేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -