Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆగష్టు 10న జరిగే జైలు భరోను జయప్రదం చేయండి

ఆగష్టు 10న జరిగే జైలు భరోను జయప్రదం చేయండి

- Advertisement -

సీఐటీయూ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్
నవతెలంగాణ-నెల్లికుదురు 
ఆగస్టు 10న జరిగే జైలు భరోను జయప్రదం చేయాలని హాల్ అమాలి వర్కర్ సంఘం మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలోని ఆ సంఘం ఆధ్వర్యంలో సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నెల్లికుదురు మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగవంతం చేస్తుందని అన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగించిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో  కార్పొరేట్ పెట్టుబడుదారులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు ప్రజాతంత్ర వాదులు పోరాడాలి అని కోరినట్లు తెలిపారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకోవాలి అందుకోసం దేశవ్యాప్తంగా ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా జరిగే జైలు బరో, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

బిజెపి ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణను దూకుడుగా అమలు చేస్తుంది. అందులో భాగంగానే లేబర్ కోడ్ అమలుపై ఫైల్ రూల్స్ నోట పై చేసింది విద్యుత్ సంస్కరణ బిల్లు విత్తన చట్టానికి సవరణలు ప్రతిపాదించారు .పెట్టుబడిదారులు కార్పొరేట్ల వ్యాపార లాభాల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసింది. అదేవిధంగా అమెరికా బ్రిటన్ న్యూజిలాండ్ మరియు 32 దేశాల తో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది దీనివలన భారత రైతాంగం వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయి ధరలు తగ్గిపోయి రైతులు దివాలా తీస్తున్నారు అని అన్నాడు.

వామపక్షాల పోరాట ఫలితంగా 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టాన్ని నీరు కార్చే విధానాన్ని రద్దుచేసి పాత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఆ సంఘటితంగా కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. పిఎఫ్ ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులపై గొడ్డలి వేటు వేశారు అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజన పథకం ఐకెపి వివోఏ ఫీల్డ్ అసిస్టెంట్ ఆరోగ్య శాఖలో వివిధ స్కీముల్లో పనిచేస్తున్నారు. వీరి ఉద్యోగ భద్రత కనీస వేతనానికి నోచుకునే పరిస్థితి లేదు ఆవేదన వ్యక్తం చెందాడు. తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు కార్మిక వర్గం కోల్పోతాయి నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకు పోరాటం చేయవలసిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో హాల్ అమాలి సంఘం నెల్లికుదురు నాయకులు తోట నరసయ్య ఐలేష్ సురేష్ బిక్షపతి వీరస్వామి శీను, మహేందర్ ఐలయ్య శేఖర్ హరీష్ మొదలగున వారు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -