Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫర్నిచర్ రంగంలో యువతకు శిక్షణ..

ఫర్నిచర్ రంగంలో యువతకు శిక్షణ..

- Advertisement -

– అదనపు కలెక్టర్ మధుమోహన్
నవతెలంగాణ –  కామారెడ్డి : ఫర్నిచర్ రంగంలో ఆసక్తి ఉన్న యువతకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో, స్కిల్ ఇండియా కార్యక్రమం కింద హైదరాబాద్‌లో ఫర్నిచర్ రంగంలో మూడు నెలల శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన 16 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. కోర్సు ఫీ రూ. 5,000 మాత్రమే అని పేర్కొన్నారు. ఈ శిక్షణ FFSC Center of Excellence, NSTI అంబర్‌పేట్, హైదరాబాద్ కేంద్రంలో నిర్వహించబడుతుందన్నారు. ఇన్‌స్టాలేషన్, మెషీన్ ఆపరేషన్స్‌లో మూడు నెలల శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు మల్టీనేషనల్ కంపెనీలలో ఆరు నెలల అప్రెంటీస్‌షిప్ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

కామారెడ్డి జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. మరిన్ని వివరాలకు 7673976699 నంబర్‌కు సంప్రదించాలని చెప్పారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మధుమోహన్ ఛాంబర్‌లో టాలెంట్ మేనేజర్ పి. అన విలాసిని, శిక్షకుడు విశ్వనాధ మోహన్ కరపత్రాన్ని అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -