Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తమ ఊరు సమస్యలు పరిష్కరించండి

తమ ఊరు సమస్యలు పరిష్కరించండి

- Advertisement -

పరిష్కార వేదికలో సర్పంచ్ వినతి
నవతెలంగాణ-మద్నూర్

మా ఊరు సమస్యలు పరిష్కరించాలని మండల పరిధిలోని తడి హిప్పర్గా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సిజిఆర్ఎఫ్-2 కార్యక్రమం 33/11 సబ్స్టేషన్లో జరిగింది. ఇందులో భాగంగా మద్నూర్, డోంగ్లి, బిచ్కుంద, జుక్కల్, మండలాల పరిధిలోని వినియోగదారుల సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా మెంబర్ అఫ్ ఫైనాన్స్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వినియోగదారుల నుండి వచ్చిన అనేక రకాల సమస్యల పరిష్కారానికి ఈ వేదిక కృషి చేస్తుందని తెలిపారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగానికి రూ.9200 డిడి కట్టిన వారికి కనెక్షన్లు ఇవ్వడానికి అనేక మంది రైతులు బోర్లు వేసుకోవడం జరిగిందని ప్రస్తుతం వర్షాకాలం అయినందున కొత్త కనెక్షన్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉన్నందున సెకండ్ గ్రాఫ్ మధ్యలో నెలరోజుల వ్యవధిలో కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. గ్రామాల్లో గాని శివారు ప్రాంతంలో గాని లైన్లు వంగిన వాటికి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లు ముఖ్యంగా బాన్స్వాడ డి ఈ వినోద్ కు ఈ సమస్యలు మళ్లీమళ్లీ ముందుకు రాకుండా పరిష్కరింప చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఈ వేదికలో సిజిఆర్ఎఫ్ చైర్మన్ చవాన్ జైవంత్ మాట్లాడుతూ.. ఈ వేదిక వినియోగదారులకు న్యాయవేదికగా పరిష్కరించడానికి కృషి చేస్తుందని తెలిపారు. అధికారులు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చర్యలు చేపట్టాలని సిజిఆర్ ఎఫ్ పరిష్కార వేదికలో ఫిర్యాదులు వస్తున్నాయి అంటే అధికారుల తీరు పైన చర్యలు తీసుకో పడతాయని అధికారులు తమ విధుల్లో సక్రమంగా పనిచేయాలని ఆదేశించారు ఈ పరిష్కార వేదికలో బాన్సువాడ డివిజన్ డి ఈ వినోద్, మద్నూర్ ట్రాన్స్కో ఏ ఈ గోపికృష్ణ, మేనూరు ట్రాన్స్కో ఏ ఈ రమేష్,, జుక్కల్ బిచ్కుంద మద్నూర్ డోంగ్లి మండలాలకు చెందిన ట్రాన్స్కో సిబ్బంది, రైతు సంఘం డివిజనల్ నాయకులు హనుమంత్ రెడ్డి, మద్నూర్ నాయకులు చాట్ల గోపాల్, వినియోగదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -