Thursday, August 6, 2026
E-PAPER
Homeజిల్లాలుసమాజ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టుల కృషి

సమాజ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టుల కృషి

- Advertisement -

పాత్రికేయుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పరిపూర్ణం 
నవతెలంగాణ-అచ్చంపేట
సమాజం సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు అలుపెరుగని కృషి చేస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పరిపూర్ణం అన్నారు. టిడబ్ల్యూజేఎఫ్  ఉమ్మడి జిల్లా విలేకరుల సమావేశాన్ని గురువారం మన్ననూరు ఫారెస్ట్ వనమాలిక గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ , జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణంలో మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా పనిచేస్తున్నారని కానీ పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు వచ్చి చెబుతున్నారని అన్నారు. అన్ని నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు  జర్నలిస్టులు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎలాంటి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన వివిధ మండలాల జర్నలిస్టులు బాధ్యతగా పాల్గొనాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు,  కార్పొరేట్ ఆస్పత్రిలో చెల్లుబాటు అయ్యేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో మినాయింపు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సమావేశం అనంతరం అచ్చంపేట తాలూకా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -