- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేఖా సుదర్శన్ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం అవసరంపై తల్లులకు అవగాహన కల్పించారు. పుట్టిన శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -



