నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించిన ఎకరం స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన పార్టీ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు, స్థలాన్ని చదును చేయడం, పనులను వేగవంతంగా చేపట్టే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఆగస్టు నెలలోనే నూతన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించేలా పనులను పూర్తి చేయాలని డా. నరేష్ జాదవ్ గారు అధికారులకు, పార్టీ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, నాయకులు బండారి సతీష్, నాయకులు గౌలి సంజీవ్ కుమార్, అనిల్ కుమార్, హిమాభిషేక్ రెడ్డినాయకులు ఉన్నారు.
నూతన డీసీసీ కార్యాలయం స్థల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



