Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ మ్యూటేషన్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి: సీపీఐ(ఎం)

అక్రమ మ్యూటేషన్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – పరకాల
పరకాల తహసీల్దార్‌పై వరుసగా వస్తున్న అక్రమ భూ మ్యూటేషన్ల చేస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, అసలు పట్టాదారుల హక్కులను పక్కనబెట్టి మ్యూటేషన్లు జరిగాయన్న ఆరోపణలు నిజమైతే ఆ అధికారిపై చర్య ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీతో సమగ్ర విచారణ చేపట్టాలని, విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత తహసీల్దార్‌ను విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గత కొన్నేళ్లలో జరిగిన అన్ని భూ మ్యూటేషన్లపై సమగ్ర పరిశీలన నిర్వహించి, అక్రమాలకు పాల్పడిన అధికారులు, దళారులు, ఇతర బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలో పేదలు, రైతులకు అన్యాయం జరిగితే సీపీఐ(ఎం) వారి పక్షాన పోరాటం చేస్తుందని బొట్ల చక్రపాణి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -