Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొహమ్మదాబాద్ తండాలో ఉచిత వైద్య శిబిరం

మొహమ్మదాబాద్ తండాలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
శుక్రవారం మండల పరిధిలోని మహమ్మదాబాద్ తండా అంగన్ వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జుక్కల్ ప్రభుత్వాస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణి చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, బిడ్డ పుట్టిన ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పరిశుభ్రత పాటించడం, మరిగించిన నీరు తాగడం, పోషకహారం తీసుకోవడం వంటి ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే జ్వరం, విరోచనాలు, వాంతులు వంటి లక్ష్యణాలు కన్పించిన వెంటనే సమీప ప్రభుత్వస్పత్రిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమం లోపల్లె దావఖానా వైద్యులు మాధవ్, సూపర్ వైజార్ విట్ట బాయి, ఏ ఎన్ ఎం స్వరూప రాణి, అంగన్వాడీ టీచర్ లక్ష్మి బాయి, ఆశ కార్యకర్తలు కె. గంగామణి, లక్ష్మి, ఎన్.శైలజ, జె. గంగామణి, అంగన్వాడీ కేంద్ర టీచర్ ఆయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -