- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లొంగన్ జీపీ గ్రామంలోని ప్రభుత్వ ఎంపి పీఎస్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు ఆఫ్రోజ్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ దేవతల ఆశీర్వచనము కొరకు బోనాల ఊరపండుగ ఘణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగలగిద్దే సదుపటేల్ మాట్లాడుతూ.. వర్షాలు బాగా కురవాలని , పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని , ,ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని,అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళి ఓడిబియ్యని,బెల్లాన్ని, కానుకగా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ సర్పంచ్, ప్రధాన ఉపాధ్యాయుడు ఆఫ్రోజ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



