Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశ్నించే హక్కును కాలరాస్తే తిరుగుబాటు చేస్తాం

ప్రశ్నించే హక్కును కాలరాస్తే తిరుగుబాటు చేస్తాం

- Advertisement -

రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధం సైదులు
నవతెలంగాణ-అచ్చంపేట
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న చేపడుతున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధం సైదులు పిలుపునిచ్చారు. శుక్రవారం అచ్చంపేట మండల కేంద్రంలోని సింగారం, నడింపల్లి గ్రామంలో కార్మికులతో కరపత్రాలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచన మేరకు కనీస వేతనం రూ.26.వేల వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను క్రమంగా తగ్గించే ప్రయత్నం జరుగుతుందని వారు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటుపరం చేస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ రంగాలను కాపాడుకొని వేలాది మందికి ప్రభుత్వ ఉపాధి చూపించాలని వారు డిమాండ్ చేశారు. 

ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వాళ్లకు దార దత్తం చేస్తూ చదువుకున్న విద్యార్థులకు ఉపాధి లేకున్నా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చాలా సిగ్గుచేటని వారు అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే హక్కును కాలరాయడం సిగ్గుచేటని వారు అన్నారు. కనీసం నిరసన చేసే హక్కును కూడా కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతుందని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున కార్మికులను రైతులను కూడగట్టుకొని తిరుగుబాటు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కార్యదర్శి రాములు, కార్మికులు వేమయ్య, రాజు, మల్లేష్, శంకర్, పార్వతమ్మ,,అలివేల, సునీత, రజిత, రైతులు, వెంకటయ్య, బక్కయ్య ,జగన్ గోపాల్ ఆంజనేయ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -