Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం..

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని అంగన్ వాడి టీచర్లు అన్నారు.తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలం వల్లెంకుంట గ్రామంలోని అంగన్వాడి అంగన్ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలు పుట్టిన పసిబిడ్డకు గంటలోపు పాలు పట్టిస్తే రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు. మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.ఆరు నెలల తర్వాత ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మ రజిత, ఉప సర్పంచ్ కటకం స్వప్న,ఏఎన్ఎం,ఆశాలు,ఆయాలు,గర్బినీలు,బాలింతలు,చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -