Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్ 

వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని ఖూదాబాక్ష పల్లి గ్రామంలో వివాదాస్పదంగా ఉన్న 188 గజాల గ్రామ కంఠం భూమిలో శుక్రవారం ట్రైనీ కలెక్టర్ వివేక్,డిపిఓ తరుణ్ చక్రవర్తి, గ్రామ సర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు గౌడ్ తో కలిసి గ్రామ మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేశారు.భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించిన కఠిన చర్యలు తీసుకోవాలని సిఐ దూది రాజుకు,ఎస్సై బి. రాంబాబుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ దూది రాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి సి  మున్నయ్య,ఎంపీఓ రవికుమార్,ఏపీఎం అద్దంకి వెంకట్,పంచాయతీ కార్యదర్శి ప్రసన్న బాబు,మహిళా సంఘాల సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -