- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం పిఆర్సీని వెంటనే ప్రకటించాలని స్థానిక ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. యుఎస్పిసి ఉద్యమ కార్యక్రమంలో భాగంగా మండలం వల్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు శుక్రవారం నిరసన ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, డిటిఎఫ్ స్టేట్ కౌన్సిలర్ టి.సుదర్శనం, ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.రమేష్ నాయక్, డిటిఎఫ్ మండల కమిటీ సభ్యులు ఎం.ప్రకాశ్, పి.సత్యనారాయణ, ఉపాధ్యాయులు జి.రఘువీర్ నాయక్, ఎల్.రాజు నాయక్, ఎస్.సమ్మయ్య, ఆర్.రాజా రావు, ఎ.కవిత, వి.నర్మద, పి.శ్రీలత, ఎ.స్వర్ణ కుమారి పాల్గొన్నారు.
- Advertisement -



