నవతెలంగాణ-నవాబు పేట
జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు నవాబుపేట మండల కేంద్రంలోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో ఎస్ఐ నరెందర్ సమక్షంలో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ అక్రమ రవాణా,వినియోగానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో “రుద్రా” అనే స్నిఫర్ డాగ్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని పాన్ షాపులు, పూల దుకాణాలు, టీ దుకాణాలు, బెల్ట్ షాపులు తదితర అనుమానాస్పద ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ నిల్వ, విక్రయం మరియు వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.“డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం – యువత భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత” అని పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ బృందాలు తదితరులు పాల్గొన్నారు.



