- రాచూర్ సర్పంచ్ లోకండే ఆకాష్
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని రాచూరు గ్రామంలో ప్రైమరీ పాఠశాలకు అలాగే గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లే దారి వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి వివాదాలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆ గ్రామ సర్పంచ్ లోకండే ఆకాష్ నవ తెలంగాణతో మాట్లాడుతూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు తనను సర్పంచ్ గా గెలిపించారని గ్రామంలోని ఒక రహదారి వివాదంగా మారుతుందని అలాంటి రహదారి రాబోయే రోజుల్లో వివాదాలు తలెత్తకుండా దారి మార్గం శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధికారులు చొరవ చూపాలని కోరారు గ్రామ పెద్దలు ఒకరు రహదారి కూడా తనదేనంటూ వివాదం సృష్టించారని సిసి రోడ్డు కూడా తనదే అనడం ఏమిటని దీనిని అధికారులు పరిష్కార మార్గం కనుగొని రాబోయే రోజుల్లో కూడా దారి వివాదం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నెల రోజుల క్రితం దారి తనదే నంటూ దారిలో రాళ్లు అడ్డంగా పెట్టడం ఆ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని తెలిపారు. ఈ వివాదం పరిష్కారం కోసం మండల ఎంపీడీవోకు మండల తాసిల్దార్ కు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. దారి స్థలం తనదే అనడానికి ప్రభుత్వం ద్వారా కొలతలు జరిపి హద్దులు వేయించుకోవాలని సిసి రోడ్డు కూడా తనదే అంటే ఎలా అని దారి గుండా వెళ్లడానికి అడ్డుపడితే వివాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని గ్రామ సర్పంచిగా ఇలాంటి వివాదాలు లేకుండా పరిష్కారం కోసం మండల ఎంపీడీవో కు మండల తాసిల్దార్ కు వినతులు అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు.



