Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెచ్ కేలూర్ లో ఘనంగా దిండి యాత్ర

హెచ్ కేలూర్ లో ఘనంగా దిండి యాత్ర

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ గ్రామంలో శుక్రవారం దిండి యాత్ర కొనసాగింది. ఈ దిండి యాత్రకు గ్రామ సర్పంచ్ జి లక్ష్మణ్ జెండాతో ముందు వరుసలో నడిచారు. ఈ గ్రామంలో వారం రోజులుగా హరినామ సప్త కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం ముగింపు రోజున గ్రామ ప్రజలంతా దిండి యాత్రతో ప్రత్యేక పూజలు జరిపేందుకు పూజా సామాగ్రి తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రామంలో హరినామ సప్త కార్యక్రమం ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలు జరుపుకుంటారని, సప్త కార్యక్రమంతో ప్రజలు ఎంతో మంచి మార్గాలు తెలుసుకున్నారని, చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడుచుకోవడానికి ఈ సప్త ఎంతో దోహద పడిందని తెలిపారు. దిండిలో చిన్నారులు ముఖ్యంగా మహిళలు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -