Saturday, August 8, 2026
E-PAPER
Homeజిల్లాలువర్షపు నీటిలో కూర్చొని కౌన్సిలర్ నిరసన

వర్షపు నీటిలో కూర్చొని కౌన్సిలర్ నిరసన

- Advertisement -

–  స్టేషన్‌ రోడ్డులో నీటి కుంటను తలపిస్తున్న ప్రధాన రహదారి
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కామారెడ్డి – కరీంనగర్ జాతీయ రహదారిలోని స్టేషన్‌ రోడ్డులో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై నీరు నిలిచిపోవడంతో అది కుంటను, చెరువును తలపిస్తోంది. ఈ సమస్యపై 46, 47వ వార్డు కౌన్సిలర్‌ గెరిగంటి స్వప్న–లక్ష్మీనారాయణ రహదారిపై నిలిచిన నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. వరద నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోందని, వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే మార్గంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు, క్షతగాత్రులను తరలించే 108 వాహనాలతో పాటు ఆస్పత్రికి వచ్చే ఇతర వాహనాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అత్యవసర సమయంలో ట్రాఫిక్‌ అంతరాయం వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి – కరీంనగర్‌కు అనుసంధానించే ప్రధాన రహదారి కావడంతో సమస్యను అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కౌన్సిలర్‌ డిమాండ్‌ చేశారు. రహదారిపై నిలిచిన వర్షపు నీరు శాశ్వతంగా తొలగిపోయేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే ఇదే ప్రాంతంలో దీక్ష చేపడతామని కౌన్సిలర్‌ గెరిగంటి స్వప్న–లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -