బెంగళూరు : కోట్ల రూపాయల విలువైన చెట్లను నెలమట్టం చేసిన కేసులో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహా అరెస్టయ్యాడు. అటవీ శాఖ కస్టడీలో ఉన్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలయ్యాడు. కర్నాటకలోని హస్సన్ జిల్లాలో కోట్ల రూపాయల విలువ చేసే మొత్తం 126 చెట్లను నేల మట్టం చేసి వేరే చోటుకు తరలించినట్టు సమాచారం. అందుబాటులో ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారం జరిగిన నేరంలో ఆయన పాత్ర ఉన్నట్టు అధికారిక నివేదిక ఒకటి పేర్కొన్నది. అనంతరం విక్రమ్ సింహా కోసం అటవీ అధికారులు గాలించగా.. పరారయ్యాడు. ఆర్గనైజ్డ్ క్రైమ్ టీమ్‌తో అటవీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి విక్రమ్ సింహాను అరెస్టు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ‘నిజం గెలిచింది’ అని విక్రమ్ సింహా అన్నారు.