Saturday, August 8, 2026
E-PAPER
Homeజిల్లాలుఅక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత 

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత 

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని కారూరు వాగు శివారు ప్రాంతాల్లో అనుమతి లేకుండా వెళ్తున్న ఫిల్టర్ ఇసుక ట్రాక్టర్ ను నవాబు పేట పోలీసు కానిస్టేబుల్ రాజు విశ్వసనీయ సమాచారం ప్రకారం శనివారం ఉదయం పట్టుకుని పోలీసు స్టేషన్లో అప్పజెప్పారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండానే ఫిల్టర్ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ వల్లూరి విజయ్, యజమాని వల్లూరి చంద్రకళపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరెందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా ఫిల్టర్ ఇసుక రవాణా చేసే వారిపై చర్యలు కఠినంగా తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -