Saturday, August 8, 2026
E-PAPER
Homeక్రైమ్అక్రమ ఇసుక వాహనం పట్టివేత 

అక్రమ ఇసుక వాహనం పట్టివేత 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను వెలికితీసి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు శనివారం సాయంత్రం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్‌కు చెందిన  పోలీస్ సిబ్బంది జె నవీన్ 36 జి. వెంకటేష్లు ఆలేరు వాగు పరిసర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, ఒక వాహనం ద్వారా వాగు నుండి ఇసుకను అక్రమంగా ట్రాలీలో నింపుతున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ట్రాలీలో ఇసుక నింపి ఉండటాన్ని గుర్తించారు.

వాహన డ్రైవర్‌ను విచారించగా అతను తన పేరు మాచర్ల గణేష్, డ్రైవర్, నివాసం ఘడి స్ట్రీట్, కొలనుపాక గ్రామమని తెలిపారు. అతను అశోక్  లేలాండ్ వాహనం నంబర్ టీఎస్ 36 టీ 6195 ద్వారా కొలనుపాక వాగు నుండి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను వెలికితీసి బచ్చన్నపేట వైపు తరలిస్తునాడని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాచర్ల గణేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్ వినయ్ కుమార్ విలేకరులకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -