Sunday, August 9, 2026
E-PAPER
Homeజిల్లాలుమాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి కేసీఆర్

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి కేసీఆర్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) దశదిన కార్యక్రమానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) హాజరయ్యారు. ఆదివారం వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లిలో నిర్వహించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కును కేసీఆర్ అందజేశారు.పిల్లల బాగోగులు, చదువలు, కుటుంబ సంక్షేమాన్ని తాము ఎల్లవేళలా పర్యవేక్షిస్తామని కేసీఆర్ మాటిచ్చారు. వారికి పార్టీ, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అనంతరం నల్లబెల్లి నుంచి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు. గులాబీ బాస్ నల్లబెల్లి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఆయనకు దారిపొడవునా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -