2006-2007 వ పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు
నవతెలంగాణ-నెల్లికుదురు
చిన్ననాటి స్నేహితుడైన పదవ తరగతి బ్యాచ్ మిత్రుడు ఈదునూరి సమ్మయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబానికి 2026-2007వ బ్యాచ్ మిత్రులు ఆదివారం రూ.5000 ఆర్థిక సహాయం చేసినట్లు స్నేహితులు తోట రమేష్ రాజు వెంకన్న భాస్కర్ శ్రీలత నవనీత మురళి ఏకాంతం మహేష్ సునీత తెలిపారు. నేడు పూర్వ విద్యార్థులు మృతి చెందిన కుటుంబాన్ని సందర్శించి ఆయన కుమారుడికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తోటి స్నేహితుడు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సమ్మయ్య ముందు స్పందించి, తనవంతు సాయాన్ని అందించేవాడని గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి మృతి చెందడం మా బ్యాచ్ క ఎంతో తీరం లోటు అని అన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు నా వంతు కృషి చేస్తుందని తెలిపారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని చెప్పారు.
మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



