Monday, August 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచమురు రిఫైనరీపై హౌతీల డ్రోన్‌ దాడి

చమురు రిఫైనరీపై హౌతీల డ్రోన్‌ దాడి

- Advertisement -

సనా : సౌదీ అరేబియాకు చెందిన ఎర్ర సముద్రం తీరంలో చమురు రిఫైనరీపై దాడి చేశామని హౌతీలు తెలిపారు. హౌతీల సైనిక ప్రతినిధి యాహ్యా సరీ ఆదివారం మాట్లాడుతూ జజాన్‌లోని ఆరామ్కో రిఫైనరీపై డ్రోన్‌ దాడి చేయడంలో విజయం సాధించామని చెప్పారు. వాయవ్య యెమన్‌లోని సాదా, హజ్రా రాష్ట్రాలపై సౌదీ దాడులు జరిపిందని, దానికి ప్రతిగానే ఈ దాడి చేశామని ఆయన చెప్పారు. దాడి కారణంగా రిఫైనరీలో మంటలు వ్యాపించాయని, కంపెనీకి చెందిన అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పేశారని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పింది.

మా నౌకపై ఇరాన్‌ దాడి చేసింది : యూఏఈ
హార్ముజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న ప్రభుత్వ రంగ అబూధాబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ) ట్యాంకర్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి చేసిందని యూఏఈ ఆరోపించింది. ఇరాన్‌ సముద్ర దొంగతనానికి పాల్పడుతోందని మండిపడింది. స్వేచ్ఛాయుత నౌకాయానానికి సంబంధించిన ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఇరాన్‌ ఉల్లంఘించిందని, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న రివల్యూషనరీ గార్డులు ఆర్థిక ఒత్తిడికి జలమార్గాన్ని ఓ సాధనంగా ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తింది. దాడులకు స్వస్తి చెప్పి హార్ముజ్‌ను పూర్తిగా, బేషరతుగా తెరవాలని ఇరాన్‌కు సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -