Monday, August 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్‌ అటార్నీజనరల్‌ గా టాడ్‌ బ్లాంచ్‌

యూఎస్‌ అటార్నీజనరల్‌ గా టాడ్‌ బ్లాంచ్‌

- Advertisement -

ఒక్క ఓటు తేడాతో ఓకే చెప్పిన సెనెట్‌
వాషింగ్టన్‌ :
అమెరికా అటార్నీ జనరల్‌గా టాడ్‌ బ్లాంచ్‌ నియామకానికి సెనెట్‌ ఆమోదం తెలిపింది. గతంలో తన వ్యక్తిగత న్యాయవాదిగా పనిచేసిన బ్లాంచ్‌ని అటార్నీ జనరల్‌గా నియమించాలని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు సైతం ఆయన నియామకాన్ని వ్యతిరేకించారు. దీంతో తనకు అనుకూలంగా ఓటేయాలంటూ బ్లాంచ్‌ గత కొన్ని వారాలుగా రిపబ్లికన్‌ సెనెటర్లను వేడుకుంటున్నారు. బ్లాంచ్‌ గతంలో తీసుకున్న కొన్ని చర్యలపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయన నామినేషన్‌కు మద్దతు ఇస్తానని లూసియానా సెనెటర్‌ బిల్‌ కాసిడి చెప్పారు. అయితే రిపబ్లికన్‌ పార్టీకే చెందిన అలస్కా సెనెటర్‌ లీసా ముర్కోవ్‌స్కీ, మైన్‌ సెనెటర్‌ సుసాన్‌ కాలిన్స్‌ మాత్రం బ్లాంచ్‌ నామినేషన్‌ను వ్యతిరేకించారు. చివరికి 50-49 ఓట్లతో బ్లాంచ్‌ నియామకాన్ని సెనెట్‌ ధృవీకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -