Tuesday, August 11, 2026
E-PAPER
Homeసినిమా‘అగధ’ హర్రర్‌ మూవీలా మాత్రమే ఉండదు

‘అగధ’ హర్రర్‌ మూవీలా మాత్రమే ఉండదు

- Advertisement -

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’.
ఈ సినిమాని ఈనెల 14న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి, దర్శకుడు బి. గోపాల్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఎం.ఎస్. రాజు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయనకు ఆయనే ట్రెండ్ సెటర్‌గా మారారు. అన్ని రకాల చిత్రాల్ని ఆయన నిర్మించారు. రాజు మీదున్న నమ్మకంతో చెబుతున్నా.. ఇది కేవలం హారర్ మూవీలా మాత్రమే ఉండదు. ‘అరుంధతి’ టైంలో అనుష్కని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఇప్పుడు కామాక్షిని చూస్తే కలుగుతోంది. సినిమాకి మంచి విజయం ఖాయం’ అని అన్నారు.
ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ,‘లాస్ట్ ఓవర్‌లో 24 రన్స్ కొట్టాలంటే ఆ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ నేను సూపర్ ఓవర్‌లా సినిమాని తీశాను. ‘అగధ’లో టెక్నికల్ టీం, ఆర్టిస్టుల టీం కలిసి పోటాపోటీగా చేశారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నా మనసు చెబుతోంది’ అని చెప్పారు.
నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ,‘టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 14న విడుదల కాబోతోన్న మా సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను. ఇకపై రాజు ‘అగధ’ రాజు అవుతారు. ఆయన సెట్‌లో ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టాన్ని చూసిన తర్వాతే ‘అగధ’ హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను’ అని అన్నారు.
భాను చందర్ మాట్లాడుతూ,‘ఈ చిత్రంతో రాజు టాప్ ప్లేస్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. గుడ్ అండ్ ఈవిల్ మధ్య జరిగే కథే ‘అగధ’. ఇలాంటి సినిమాని థియేటర్లో చూస్తేనే ఆ థ్రిల్ వస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -