రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘పాంచాలి పంచభర్తృక’. దర్శకుడు గంగ సప్తశిఖర. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్స్ పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు. ఈ నెల 14న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లా డుతూ,‘మా సినిమా ఆద్యంతం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమా మీకు నచ్చకపోతే మా రాయల్ థ్రోన్ బ్యానర్ ఇన్ స్టా పేజికి టికెట్ పెట్టండి మీ డబ్బులు రిటర్న్ ఇస్తాం. ప్రేక్షకులు మెచ్చిన ఏ సినిమా అయినా ఫెయిల్ కాదు. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నన్ను ఇంతలా వాడుకున్న దర్శకుడు నువ్వే అని కితాబు ఇచ్చారు. ఇటీవల కాలంలో మాలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాలేదు అని గర్వంగా చెప్పగలను’ అని అన్నారు.
సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి, తదితరులు నటించిన ఈ సినిమాకి ఎడిటింగ్ – జానీ బాషా, నాగచైతన్య, సినిమాటోగ్రఫీ – కె.వి. ప్రసాద్, సంగీతం: మహేశ్ నారాయణ, బి షేక్, కథ: బాబీ కేఎస్ఆర్, స్క్రీన్‌ప్లే: రాజ్ పవన్.
నచ్చక పోతే డబ్బులు వాపస్
- Advertisement -
- Advertisement -



