Tuesday, August 11, 2026
E-PAPER
Homeసినిమా‘ఐ యామ్ గేమ్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఐ యామ్ గేమ్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. ఈ సినిమా నుంచి ‘ఎవరే నువ్వే’ పేరుతో విడుదలైన పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాట తెలుగు వెర్షన్‌కు సనారే సాహిత్యం అందించారు. ఈ పాటను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు.
పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పాట వైరల్‌గా మారింది.
దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 20న ఓనం కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్నారు. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబూబక్కర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన స్పందన వచ్చింది. అద్భుతమైన విజువల్స్, హై-వోల్టేజ్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమాకి జిమ్షీ ఖాలిద్ సినిమాటోగ్రఫీ అందించగా, అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం, యాక్షన్, విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -