Tuesday, August 11, 2026
E-PAPER
Homeసినిమా‘గజ’ టీజర్ అదుర్స్‌

‘గజ’ టీజర్ అదుర్స్‌

- Advertisement -

చల‌మ‌ల‌శెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. ఈ సినిమాకి సతీష్ జై దర్శకత్వం వహించారు.
ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ,‘సతీష్ జై హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ధైర్యం చేసి అడుగు ముందుకు వేశారు. టీజర్ బాగుంది. మణిశర్మ అద్బుతమైన స్కోర్ ఇచ్చారు. చిన్నా, పెద్దా, కొత్త, పాత అన్న తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరో, దర్శకుడు సతీష్ జై మాట్లాడుతూ,‘ఈ చిత్రానికి గట్స్ కా బాప్ అని ట్యాగ్ లైన్ పెట్టాను. గట్స్ కా బాప్ అంటే మంచు మనోజ్ . ఆయన ఎంత బిజీగా ఉన్నా నా కోసం వచ్చారు. ఓ ఆడియెన్‌గా ఆలోచించే ఈ కథను రాసుకున్నాను. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోద్ది. ప్రతీ సీన్‌ ఎంగేజింగ్‌గా ఉంటుంది’ అని తెలిపారు. నిర్మాత మైత్రి శరణ్ మాట్లాడుతూ, ‘సునీల్ మాకు ఓ పిల్లర్‌గా నిలిచారు. మా కో ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. నా భర్త సతీష్ జై ఈ చిత్రానికి సోల్. మణిశర్మ మాకు అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. ఇది కేవలం టీజర్ మాత్రమే. మున్ముందు చాలా కంటెంట్ వస్తుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -