Tuesday, August 11, 2026
E-PAPER
Homeఆటలుసుయశక్తి అవార్డుల ప్రదానం

సుయశక్తి అవార్డుల ప్రదానం

- Advertisement -

హైదరాబాద్‌ : క్రీడలు, విద్య, సాహిత్యం, సామాజిక సేవ, కళలు, సంస్కృతి, వ్యాపార సహా భిన్న రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలకు సుయశక్తి అవార్డులు ప్రదానం చేశారు. సోమవారం జరిగిన అవార్డుల కార్యక్రమానికి తమిళనాడు ఆర్థిక మంత్రి మరియ విల్సన్‌, విద్యా శాఖ మంత్రి రాజమోహన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలు రంగాల్లో రాణి్స్తున్న మహిళా వ్యాపారవేత్తలు అరుణ సుబ్రమణియం, అనుపమ కాదాంబి, అఖిల రాజేశ్వరి, బ్రింద శివకుమార్‌, అరుణ గుహాన్‌, ఫర్హాన సుహైల్‌, నైనా రెడ్డి, విపి రజినిరెడ్డిలు సుయశక్తి పురస్కారాలు అందుకున్నారు. శక్తి మసాలా వ్యవస్థాపకులు పి.సి దురైసామీ, డైరెక్టర్‌ శాంతి దురైసామీలు సుయశక్తి అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -