Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మందకృష్ణ మాదిగకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ ఆహ్వానం

మందకృష్ణ మాదిగకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌తో కలిసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరుకావాలని మందకృష్ణ మాదిగను ఆహ్వానిస్తూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరగా, మందకృష్ణ మాదిగ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో నిండాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -