Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వచ్ఛత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం 

స్వచ్ఛత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
పట్టణ ప్రజలందరూ స్వచ్ఛత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటామని పురపాలక సంఘ చైర్ పర్సన్ దండి లక్ష్మి అన్నారు. మంగళవారం పట్టణంలోని 11వ వార్డులో సఫాయి అప్నా భీమారీ భగావో అనే కార్యక్రమం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ  ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచించారు .పాత టైర్లలో, కుండ లలో రంజాన్లలో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. చేతులను పరిశుభ్రంగా కడుకోవాలని, డయేరియా,డెంగ్యూ మలేరియా, టైఫాయిడ్ రోగాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇంటి పరిసరాలలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ ,కౌన్సిలర్లు బురుగు లత , కొండ రజిత, పిల్లి తిరుపతి, గడిపే సంపత్ , సావుల మంజుల, పూదరి వరప్రసాద్ , కిరణ్ ప్రసాద్ ,శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -