నవతెలంగాణ – కామారెడ్డి : నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల ఎండు గంజాయిని కామారెడ్డి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నిందితులు మాత్రం పట్టుబడకపోవడంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, జిల్లా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, రైల్వే పోలీసుల సహకారంతో నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించారు. సంబల్పూర్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో విశ్వసనీయ సమాచారం మేరకు సంయుక్తంగా తనిఖీలు చేపట్టగా 6 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. గంజాయిని తరలిస్తున్న నిందితులు అక్కడ లేకపోవడంతో ఎవరినీ అరెస్టు చేయలేదని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. నిందితుల గుర్తింపు కోసం దర్యాప్తు, గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, డీటీఎఫ్ సీఐ సుందర్ సింగ్, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, శరత్ కుమార్, ట్రైనీ ఎస్సైలు అనిల్, మధు, సిబ్బంది జాన్, ఫరీద్, అమృత్ రెడ్డి, శంకర్, పవన్, నర్సింలు, శరత్, దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో 6 కిలోల ఎండు గంజాయి పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



