నవతెలంగాణ – మిడ్జిల్ : కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుంది. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని సర్పంచ్ డోలు మంగమ్మ శ్రీనివాసులు చెప్పారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ మంగమ్మ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ కార్యక్రమం జరిగింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ భారీగా వైద్య ఖర్చులు భరించిన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిధులు మంజూరయ్యాయి అని చెప్పారు. లబ్ధిదారులకు సర్పంచ్ మంగమ్మ స్వయంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బండారిగొడుగు పద్మ కు 18 వేల రూపాయలు బండారి బోందయ్య కు 60 వేల రూపాయలు అందజేశారు. కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు ఎంతో అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ తిరుపతయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి చాన్ పాషా ,ఉపాధ్యక్షుడు బిక్షమయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంపంగి శీను , గణేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



