నవతెలంగాణ-హైదరాబాద్: సిటీలో రోడ్ల మరమ్మతులతో ఉప్పల్ రింగ్ రోడ్డు మూసివేసిన విషయం తెలిసిందే. ప్రత్నామ్నాయ మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగుతున్నాయి. తాజాగా ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూరా వన్ వే అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అండర్ పాస్, ఫ్లైఓవర్ ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు వన్ వే అమల్లో ఉంటుందని తెలిపారు.
ఈ రూట్లో వన్ వే కోసం ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేశారు పోలీసులు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు ఉన్న రెండు రోడ్లలో ట్రాఫిక్ ని అనుమతిస్తామని… కేబీఆర్ పార్క్ చుట్టూ రెండ లైన్లలో వన్ వే ట్రాఫిక్ మాత్రమే అనుమతిస్తామని తెలిపారు పోలీసులు.
వన్ వే అమలుతో ట్రాఫిక్ ఫ్రీ అవుతుందని… లాంగ్ జర్నీ అయినప్పటికీ వాహనాలు ఎక్కడా ఆగకుండా వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఎమర్జెన్సీ సర్వీస్ వెహికల్స్ రాకపోకల విషయంలో ఆంక్షల సడలింపు ఉంటుందని తెలిపారు. కేబీఆర్ పార్క్ దగ్గర వాకర్స్ రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు చేశామని… వాకింగ్ వచ్చేవారు వాహనాలు రోడ్లపై వాహనాలు నిలిపేందుకు వీల్లేదని తెలిపారు పోలీసులు.



