నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్: మండలంలోని అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ్ఎం ఆర్ మల్లీశ్వరి అధ్యక్షతన జాతీయస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానములు నిలిచిన విద్యార్థుల విద్యార్థులను మంగళవారం అభినందించినారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ పాఠశాల నుండి ఈనెల 7, 8 ,9 తేదీలలో విశాఖపట్నం లోని ఎర్రవరం డి పాల్ స్కూల్ లో జరిగిన సౌత్ జోన్ నేషనల్ లగూరి చాంపియన్షిప్ లో పాఠశాలల నుంచి 13 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని, లగోరి అసోసియేషన్ ఏపీ వారు నిర్వహించడం జరిగిందని అన్నారు. విద్యార్థుల్లో బాలికలు జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం, బాలురు జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ లగోరి కప్ బహుకరించబడిందని తెలిపారు.
లగోరీ గేమ్లు పాల్గొన్న విద్యార్థులు శృతి భాను శ్రీ షైనీత, రిషిక, భవ్య శ్రీ రితిక, ఆనందిని, స్నేహిత, స్వాతిక, నిత్య, బాలురలో ధనుష్, సుశాంత్, రక్షిత్ లు పాల్గొనడం జరిగిందని అన్నారు. లగోరి ఆటలు జాతీయ స్థాయికి తీసుకెళ్లిన పాఠశాల పిడి దేవ సుకన్య , జిహెచ్ఎం మరియు ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం కూడా అంక్సాపూర్ విద్యార్థులు జాతీయ స్థాయికి మరియు అంతర్జాతీయ స్థాయికి వెళ్లారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ సంవత్సరం జాతీయ స్థాయి నుండి ఈ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటారని విద్యార్థి విద్యార్థులు ఆటల్లో ముందున్నందుకు తనకు ఎంతగానో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హెచ్ఎం తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం రవి చందర్, రఘునాథ్, శ్రీదేవి, రాజేంద్ర, సదాశివ్, దేవరాజ్, వినోద్, శ్రీలక్ష్మి, యమునా, జాన్సన్, వేణుగోపాల్ రెడ్డి, రాజు, సిఆర్పి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.



