నవతెలంగాణ – మల్హర్ రావు
మండల అభివృధ్ది ప్రధాత స్వర్గీయ బెల్లంకొండ మల్హర్రావు జయంతి సందర్బంగా కొయ్యూర్ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన మల్హర్రావు విగ్రహానికి మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బుధవారం మండల నాయకులు కార్యకర్తలు పూలమాలవేసి ఘన నివాళిలు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆనాడు సర్పంచ్‌గా మల్హర్రావు మండల అభివృధ్దికి బీజం వేశారని గుర్తు చేశారు. నాగులమ్మ ఆలయం నుంచి మల్లారం తాడిచర్ల వరకు రోడ్లు నిర్మాణం కోసం అధికారులను ఎదిరించారని, ప్రజల అవసరాల కోసం ఎవరినైనా ఎదిరించవచ్చని గొప్ప సూక్తిని చాటారన్నారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేసిన కొమురం భీం స్పూర్తితో మల్హర్రావు ఈ ప్రాంత అభివృధ్దికి ఎనలేని కృషి చేశారని, అడవులు అడ్డంగా ఉన్నా రోడ్ల నిర్మాణం చేయించిన గొప్ప నాయకుడని కొనియాడారు.
మండల అభివృధ్దికి ఎంత కృషి చేశారో ఆయన స్పూర్తిని తీసుకుని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సారధ్యంలో (ఆశీస్సులతో) మండల రూపురేఖలు మార్చిన చరిత్ర తమదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడా అభివృధ్ది జరుగలేదన్నారు. మల్హర్రావు ఆలోచనలు, ఆకాంక్షను, ఆశయాలను మండల ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల కోసం ఆనాడు మల్హర్రావు పరితపించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల కోసం పుట్టిన వాళ్లు ఏ విధంగా ఉంటారో, ప్రజలను వాడుకునే వాళ్లు ఏ విధంగా ఉంటున్నారో చాటి చెప్పనన్ని రోజులు చీకట్లోనే ఉంటామని ఆయన వివరించారు.
మల్హర్రావు ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలుపుతూ మండలం అభివృద్ధి చేసుకోవాలంటే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మలహర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మండల యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్ ,మాజీ పాక్స్ చైర్మన్ చెప్యాలా రామారావు,మాజీ అధ్యక్షుడు తాజుద్దీన్,మహిళా అధ్యక్షురాలు చంద్రకళ,అడ్వాలపల్లి సర్పంచ్ అజ్మీర సారక్క బాలాజీ నాయక్,దుబ్బపేట సర్పంచ్ భూక్యా రవీందర్,ఉప సర్పంచులు రాజేందర్,పులిగంటి రాములు,సీనియర్ నాయకులు వాల యాదగిరి రావు,ఢిల్లీ రాజు,నౌళ్ళ సంపత్, వేముల శ్రీశైలం, వేల్పుల శేఖర్ అయుబ్ ఖాన్, సిద్ధి లింగమూర్తి,యాధండ్ల రామన్న, అన్నమనేని మధుసూదన్ రావు, దడే సునీల్ రావు, అడ్డూరి కుమార స్వామి, మందొట రాజబాబు, అక్కినవేన సమ్మయ్య, పంచిక మల్లేష్ ,యాదాండ్ల గట్టయ్య మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మలహర్ రావు గారి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



