నవతెలంగాణ-బాల్కొండ
రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం బాల్కొండ తహసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ..పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. ఇందులో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. పిఆర్సి వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలని, కేజీబీవీ గురుకుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 21న జిల్లా కేంద్రంలో ధర్నాలు, 29న రాష్ట్ర రాజధానిలో వేలాది మంది ఉపాధ్యాయులతో భారీ నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఓ.రమేష్, ఓడ్నాల శ్రీనివాస్ బోయిడ నరసయ్య కే చంద్రశేఖర్ పబ్బ శంకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



