నవతెలంగాణ-కుభీర్
మండలంలోని న్యూ సౌంలీ గ్రామానికి చెందిన కే లక్ష్మణ్, రంజిని జాదవ్ కైలాష్ తో పాటు కుభీర్ లో ఓ వ్యక్తి ఇటీవల వివిధ కారణాల వల్ల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ క్రమంలో వారి మృతికి గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ అధైర్య పడొద్దని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శంకర్ చవాన్, సర్పంచ్ సాయినాథ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్,మాజీ చైర్మన్ సంతోష్,సౌంలీ సర్పంచ్ సాయినాథ్, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూది రాజన్న నాగలింగం రంగారావు గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



