Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంటరానితనాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మూలిస్తుంది

అంటరానితనాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మూలిస్తుంది

- Advertisement -

 రాష్ట్ర ప్రభుత్వ విపు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ-ఆలేరు టౌను

దేశంలో అంటరానితనాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మూలిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం దళిత, గిరిజన, మైనార్టీ  , ఆదివాసుల పట్ల బీజేపీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిందని, స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు జరుగుతున్న, ప్రజాస్వామ్య దేశంలో బిజెపి కుని చేస్తుందని ఆరోపించారు.

 బిజెపిని గద్దె దించేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అన్నారు. బిజెపి ప్రభుత్వం అన్ని వర్గాలను అలసివేస్తుందన్నారు. మతాల మధ్య కులాల మధ్య మోడీ చిచ్చు పెడుతున్నారని చెప్పారు. భారతదేశంలో ప్రతి పౌరునికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హక్కులు కల్పించారని, బిజెపి అంటరానితనం ముందుకు తీసుకొస్తున్నదని అన్నారు. గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళుతున్న కాంగ్రెస్ జాతీయ నాయకులు మల్లికార్జున కార్గేను అవమానించారని చెప్పారు.

 బిజెపి కుల్లు కూతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 2029 ఎన్నికలలో బిజెపి ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఆగడాలను, ప్రజలు పాతాళానికి తొక్కుతారని చెప్పారు. 12 ఏళ్లలో 154 సార్లు పరీక్ష పత్రాలు లీకయ్యాయని చెప్పారు. మోడీకి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేస్తున్నారని చెప్పారు. ప్రజాపాలనలో కులమతాలు లేవని అన్నారు. 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మాజీ ఎంపీపీ గంగమ్మల అశోక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బిజన బాలమణి భాస్కర్,ఆలేరు పిఎసిఎస్ చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట చైర్మన్ చీర శ్రీశైలం,రాజపేట చైర్మన్ నమ్లే మహేందర్, శంకర్ నాయక్, కాంగ్రెస్  అధ్యక్షులు కే సాగర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతున్న ప్రమోద్ కుమార్, తంగేళ్లపల్లి రవికుమార్, ఎంఏ ఎజాస్, శ్రావణ్ కుమార్, బుడిగే పెంటయ్య, ఆరే ప్రశాంత్, చింత కింది మురళి , ఎమ్మెస్ విజయ్ కుమార్, తాడిపల్లి శ్రవణ్ కుమార్, పిట్టల జయరాములు, మల్లేశం, మున్సిపల్ కౌన్సిలర్లు, పిఎసిఎస్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -