Sunday, August 16, 2026
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

టాపిక్‌ డైవర్ట్‌
‘నాకోసం నువ్వేమైనా చేస్తావా’
‘చేస్తాను’
‘నేను తాగొస్తే గొడవ పడవ్‌ కదా?’
‘గొడవ పడను’
‘మీ పుట్టింటికి వెళ్లవు కదా?’ ‘వెళ్లను’
‘షాపింగ్‌ కోసమని చీటికిమాటికి డబ్బులు అడగవు కదా?’
‘అడగను’
‘తిండి సరిగా పెట్టడం లేదని నన్ను తిట్టుకోవు కదా?’
‘తిట్టను’
‘కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదని కోపగించుకోవు కదా?’ ‘లేదు’
‘అదే పనిగా సీరియల్స్‌ చూడ్డం మానేస్తావు కదా?’
‘బాగా అలసిపోయి వచ్చారు.. తిని పడుకోండి’
ఇంకో ఆప్షన్‌
భార్య : ఏమండీ… డాక్టర్‌ గారు నన్ను ఓ నెల విశ్రాంతి తీసుకోడానికి స్విట్జర్లాండ్‌ కానీ, స్పెయిన్‌కానీ టూర్‌కి వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఎక్కడికి, ఎప్పుడు వెళ్దామో చెప్పండి.
భర్త : రేపే ఇంకో డాక్టర్‌ దగ్గరికి వెళ్దాం.
ఓవర్‌టైమ్‌
పోలీస్‌ : ఇలా పగటి పూట కూడా కన్నాలేసి దొరికిపోయేవాడిని నిన్నే చూస్తున్నా.
దొంగ : మరేం చెయ్యమంటారు సార్‌… రాత్రి పూట దొంగతనం చేస్తే వచ్చిన డబ్బు సరిపోవట్లేదు. అందుకే ఓవర్‌టైమ్‌ చేస్తున్నా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -