Sunday, August 16, 2026
E-PAPER
Homeసమీక్షతెలంగాణ యాస సొబగులు...

తెలంగాణ యాస సొబగులు…

- Advertisement -

రచయిత తన రచనల ద్వారా మంచిని పెంచడం, చెడుని తుంచడం, అన్ని రకాల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయడం ద్వారా సామాజిక చైతన్యాన్ని అలవర్చుకోవాలి. తన చుట్టూ జరుగుతున్న జీవిత సత్యాలని గ్రహించి, వాటిని తన రచనల్లో కళాత్మకంగా తెలియపరుచాలి. అలాగే ప్రజల చేతిలో సాహిత్యం ఒక సాంస్కృతిక ఆయుధం కావాలి. శ్రమ సంస్కతికి పునాది. శ్రమజీవులే జీవద్భాషని సష్టిస్తారు, పెంపొందిస్తారు. రచయిత దాన్ని గుర్తించాలి. తన సాహిత్య సృజనతో మరింత పరిపుష్టం చేసి మెరుగులు దిద్దాలి. అందుకు రచయిత హృదయంలో ఆ లక్ష్యం ఉండాలి. చెప్పబడిన విషయం, చెప్పిన విధానం అనే రెండు విషయాల్లో రచన గొప్పదనం ఆధారపడి ఉంటుంది.
పైన పేర్కొన్న లక్షణాలన్నీ కవీ, కథకుడూ, చిత్రకారుడూ అయిన పర్కపెల్లి యాదగిరి కొత్త కథా సంపుటి ‘పొలిమేర దాటే వేళ’లో పుష్కలంగా ఉన్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో మొత్తంగా పన్నెండు కథలున్నాయి. ఇవి వివిధ పత్రికలూ సంస్థలూ నిర్వహించిన పోటీలలో బహుమతులు సాధించినవే ఉండటం విశేషం.
– శిరంశెట్టి కాంతారావు, 9849890322

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -