Thursday, April 2, 2026
E-PAPER
HomeNewsనర్సాపూర్ లో చలివేంద్రం ప్రారంభం

నర్సాపూర్ లో చలివేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  :  మండలంలోని నర్సాపూర్ గ్రామంలో గురువారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ కూడలిలోని బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ బుస్సాపురం సంధ్య రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి ఎండలు మండుతున్నందున  ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రంలో చల్లని నీటిని ఉంచుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. నీటిని వృధా చేయకుండా ప్రయాణికులు తమ దాహార్తిని తీర్చుకునేందుకు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్ట రాజ్ కుమార్, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి రమేష్, పంచాయతీ కార్యదర్శి జులేఖ, వార్డు సభ్యులు  రాజేందర్, లింబన్న, భూదేవి, రుచిత, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -