నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు మున్సిపాలిటీలో సానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ స్వామికి, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని, మున్సిపాలిటీలో విధులు సక్రమంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, అంకితభావంతో ప్రజాసేవలో రాణిస్తూ, పరిశుభ్రతతో సమాజానికి చేసిన సేవలకు గాను, ఉత్తమ సానిటరీ ఇన్స్పెక్టర్ అవార్డు ఎంపికయ్యారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎస్ స్వామికి, ఉత్తమ సానిటరీ ఇన్స్పెక్టర్ అవార్డు అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జగన్మోహన్ వార్డు అధికారులు స్వామికి అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత సేవ దృక్పథంతో బాధ్యతగా విధులు నిర్వహించాలని కోరారు.



