నవతెలంగాణ -పరకాల
పరకాల పట్టణ ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పరకాల పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ శక్తి పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఎస్‌బీటీఈటీ బోర్డును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో హాస్టళ్లు, ల్యాబ్‌లు, భవనాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, అధ్యాపకులు, సిబ్బంది సర్వీస్ నిబంధనలకు రక్షణ కల్పించాలని కోరారు.పాలిటెక్నిక్ కళాశాలలను వైఐఎస్‌యూలో విలీనం చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి బొచ్చు ఈశ్వర్, పరకాల పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్, నాయకులు ప్రశాంత్, నాగరాజ్, అభినవ్, విద్యార్థులు పాల్గొన్నారు.
పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



