
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండలంలోని శుక్రవారం నాడు అభయ హస్తం గ్యారంటి సంక్షేమ పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అధికారులు పలు గ్రామాలలో నిర్వహించారు.వివరాలకై తెలంగాణ రాష్టంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకంను అమలు చేసే విదంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.ఇందులో భాగంగా జగనపల్లి, కుభ్యనాయక్ తాండలలో ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుండి భారీగా దరఖాస్తులు అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, ఎంపీవో సురేకాంత్, పంచాయతీ సెక్రెటరీ శివాజీ, సర్పంచ్ నాన్నకు సింగ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.