నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని అబ్బాపూర్ తండాలో ప్రజా పాలన గ్రామసభను తహసిల్దార్ ధన్వాల్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన దరఖాస్తులను ప్రతి ఒక్కరు చేసుకొని ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందాలని సూచించారు. శనివారంతో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగియనుందని దరఖాస్తులు చేసుకొని వారు కచ్చితంగా చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు సుమారు 300 దరఖాస్తులు గ్రామంలో స్వీకరించామని, దరఖాస్తులను తప్పులు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రామకృష్ణ, ఏపీఎం భూమేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, కోలా పీర్ సింగ్, శోభన్, వ్యవసాయ అధికారులు, అంగన్వాడీలు, ఆశాలు పాల్గొన్నారు.